తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం | Tirumala ghat road accident | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

Sep 28 2015 1:05 AM | Updated on Apr 3 2019 7:53 PM

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం - Sakshi

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

తిరుమల శ్రీవారి దర్శిం చుకుని తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబం ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. మహారాష్ట్ర లాతూర్ జిల్లా ఉద్దిగిరి గ్రామానికి

14 మంది భక్తులకు గాయాలు

 తిరుపతి కార్పొరేషన్ : తిరుమల శ్రీవారి దర్శిం చుకుని తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబం ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైంది.  మహారాష్ట్ర లాతూర్ జిల్లా ఉద్దిగిరి గ్రామానికి చెందిన అనిల్‌కిషన్‌లాల్, తన కుటుంబ సభ్యులు 14 మందితో కలిసి మ్యాక్సీ క్యాబ్‌లో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం శనివారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో మొదటి ఘాట్ రోడ్డులో క్యాబ్ అదుపు తప్పి మలుపు వద్ద పిట్టగోడను వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న అందరూ తీవ్రంగా గాయపడ్డారు.

వీరిని అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘాట్ రోడ్డులో మ్యాక్సీ క్యాబ్ ప్రమాదానికి గురికావడంతో కొంత సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement