థాయ్‌లాండ్ ప్రధాని పరార్ | Thailand's Prime Minister Yingluck Shinawatra on protests | Sakshi
Sakshi News home page

థాయ్‌లాండ్ ప్రధాని పరార్

Dec 2 2013 12:50 AM | Updated on Sep 2 2017 1:10 AM

థాయ్‌లాండ్ ప్రధాని పరార్

థాయ్‌లాండ్ ప్రధాని పరార్

థాయ్‌లాండ్‌లో వారం రోజులుగా సాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఆదివారం హింసాత్మకంగా మారాయి.

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో వారం రోజులుగా సాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఆదివారం హింసాత్మకంగా మారాయి. రామ్‌ఖామ్‌హేంగ్ వర్సిటీ ప్రాంగణంలో చెలరేగిన ఘర్షణల్లో ఐదుగురు మరణించారు. ఈ ఘర్షణల్లో మరో 54 మంది గాయపడ్డారు. ప్రధాని యింగ్లుక్ షినవత్రాకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు ప్రజా తిరుగుబాటు స్థాయికి చేరుకోవడంతో, ఆమె సురక్షితమైన పోలీసు ప్రాంగణంలోకి పోయి, అక్కడ తలదాచుకున్నాయి. ప్రధాని నివా సం, కార్యాలయం ఉన్న ప్రభుత్వ భవనం చుట్టూ ఉన్న ఇను ప కంచెను తెంచి లోనికి చొరబడేందుకు నిరసనకారులు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
 
 దాదాపు 30వేల మం ది నిరసనకారులు మూకుమ్మడిగా విరుచుకుపడటంతో పోలీ సులు వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. ప్రధాని దేశాన్ని విడిచి పారిపోయినట్లు వచ్చిన వదంతులను ప్రభుత్వం ఖండించింది. కాగా, థాయ్‌లాండ్‌లో సోమవారం దేశవ్యాప్త సమ్మెకు, నిరసనోద్యమానికి నాయకత్వం వహిస్తున్న డెమోక్రాట్ పార్టీ నేత, మాజీ ఉపప్రధాని థౌగ్సుబాన్ పిలుపునిచ్చారు. పది ప్రభుత్వ కార్యాలయాలను, ఆరు టీవీ చానళ్లను, పోలీసు ప్రధాన కార్యాలయాన్ని, ప్రధాని కార్యాలయాన్నీ స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement