రాష్ట్రపతి భవన్ కు చేరిన తెలంగాణ బిల్లు | telangana bill reached to rashtrapati bhavan | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి భవన్ కు చేరిన తెలంగాణ బిల్లు

Dec 6 2013 8:54 PM | Updated on Aug 18 2018 4:13 PM

రాష్ట్రపతి భవన్ కు చేరిన తెలంగాణ బిల్లు - Sakshi

రాష్ట్రపతి భవన్ కు చేరిన తెలంగాణ బిల్లు

తెలంగాణ బిల్లు రాష్ట్రపతి భవన్‌కు చేరింది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దీన్ని ఎల్లుండి(ఆదివారం) పరిశీలించే అవకాశముంది.

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు రాష్ట్రపతి భవన్‌కు చేరింది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దీన్ని ఎల్లుండి(ఆదివారం) పరిశీలించే అవకాశముంది. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రపతి పరిశీలించిన తర్వాత బిల్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు చేరుతుంది.

అసెంబ్లీ నుంచి బిల్లు వచ్చిన తర్వాత తిరిగి కేంద్ర కేబినెట్‌లో చర్చించి తుది బిల్లును ఖరారు చేసి పార్లమెంటులో ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే నిన్న తెలిపారు.బిల్లు విషయంలో అసెంబ్లీకి రాష్ట్రపతి ఎంత సమయం ఇస్తారనేది తనకు తెలియదని.. అయితే ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిన్న ఆమోదం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement