విభజన బిల్లుపై న్యాయ సలహా కోరిన రాష్ట్రపతి | Pranab Mukherjee seeks Legal Advice over Telangana Bill | Sakshi
Sakshi News home page

విభజన బిల్లుపై న్యాయ సలహా కోరిన రాష్ట్రపతి

Dec 9 2013 1:18 PM | Updated on Sep 27 2018 5:59 PM

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విభజన బిల్లుపై న్యాయ సలహా కోరారు.

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన బిల్లుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం పరిశీలించారు. పరిశీలన అనంతరం ఆయన విభజన బిల్లుపై న్యాయ సలహా కోరారు.  కాగా ప్రణబ్ ముఖర్జీ ఈరాత్రికి నెల్సన్ మండేలా అంత్యక్రియాల్లో పాల్గొనేందుకు  దక్షిణాఫ్రికా పర్యటనకు వెళుతున్నారు. దాంతో ఆయన ఈనెల 11న దక్షిణాఫికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అయితే సోమవారమే తెలంగాణ బిల్లును అసెంబ్లీకి పంపుతారని కేంద్రమంత్రి జైరాం రమేష్‌ చేసిన ప్రకటనతో సందిగ్ధం నెలకొంది. కాగా శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు వచ్చే అవకాశం లేనట్లు జీవోఎం సభ్యులు తెలిపారు. ఇక తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో నలభై రోజులు సమయం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement