టాటా డొకొమో నుంచి ఫోటాన్ మ్యాక్స్ వైఫై | Tata Docomo Photon Max Wi-Fi dongle launched for Rs 1,999 | Sakshi
Sakshi News home page

టాటా డొకొమో నుంచి ఫోటాన్ మ్యాక్స్ వైఫై

Nov 30 2013 1:18 AM | Updated on Sep 2 2017 1:06 AM

టాటా డొకొమో నుంచి ఫోటాన్ మ్యాక్స్ వైఫై

టాటా డొకొమో నుంచి ఫోటాన్ మ్యాక్స్ వైఫై

టాటా డొకొమో సీడీఎంఏ కస్టమర్ల కోసం ‘ఫోటాన్ మ్యాక్స్’ పేరుతో డాంగిల్ వంటి వైఫై ఉపకరణాన్ని అందుబాటులోకి తెచ్చింది.

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా డొకొమో సీడీఎంఏ కస్టమర్ల కోసం ‘ఫోటాన్ మ్యాక్స్’ పేరుతో డాంగిల్ వంటి వైఫై ఉపకరణాన్ని అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్.. ఇలా ఏదేని అయిదు ఉపకరణాల్లో దీని ద్వారా ఒకే సమయంలో ఇంటర్నెట్ వినియోగించవ చ్చు.
 
 6.2 ఎంబీపీఎస్ వేగంతో ఇది పనిచేస్తుందని కంపెనీ ఆంధ్రప్రదేశ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ హెడ్ ఎస్.రామకృష్ణ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. రూ.650 నుంచి రూ.1,500 విలువ గల వైఫై ప్లాన్‌లలో దేనినైనా కస్టమర్లు ఎంచుకోవచ్చని చెప్పారు. క్వాల్‌కామ్ కంపెనీ ఈ ఉపకరణాన్ని తయారు చేసింది. డ్యూయల్ ప్రాసెసర్‌ను ఇందులో పొందుపరిచారు. ధర రూ.1,999. దేశవ్యాప్తంగా రోమింగ్ ఉచితం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement