శాంతి చర్చలు సజావుగా జరిపేందుకు తాలిబాన్లకు పాకిస్థాన్ లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పాకిస్థాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మరోసారి స్పష్టం చేశారు.
తాలిబాన్లకు అవకాశమివ్వండి: ఇమ్రాన్ ఖాన్
Oct 1 2013 11:48 PM | Updated on Mar 23 2019 8:32 PM
శాంతి చర్చలు సజావుగా జరిపేందుకు తాలిబాన్లకు పాకిస్థాన్ లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పాకిస్థాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మరోసారి స్పష్టం చేశారు. అయితే రాజ్యాంగాన్ని, పార్లమెంట్ నియమ నిబంధనల్ని వ్యతిరేకిస్తే తాలిబాన్లపై తీవ్ర చర్యలు తప్పవని ఇమ్రాన్ హెచ్చరించారు.
ఇటీవల ఖైబర్ పఖ్తూన్ ఖ్వా ప్రాంతంలో నిషేదిత తాలిబాన్లకు కార్యాలయ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని సూచించడంపై మీడియా, రాజకీయ విశ్లేషకులు ఇమ్రాన్ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఈ రోజు పాకిస్థాన్ లో మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శాంతి చర్చలు జరుపడానికి తాలిబన్లు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మరోసారి వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement