
’కావేరి’పై వ్యాఖ్యలు చేయలేదు: హీరో
మనస్సులోని మాట ఉన్నదున్నట్టు చెప్పడంలో తమిళ హీరో శింబూ ఎప్పుడూ వెనుకడుగు వేయడు.
మనస్సులోని మాట ఉన్నదున్నట్టు చెప్పడంలో తమిళ హీరో శింబూ ఎప్పుడూ వెనుకడుగు వేయడు. గతంలో పలువురు సెలబ్రిటీలపై బాహాటంగా వ్యాఖ్యలు చేసి ఆయన వివాదం రేపిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా కర్ణాటక-తమిళనాడు మధ్య ఉద్రిక్తతలు రేపుతున్న కావేరీ జలాల విషయంలో మాత్రం శింబూ వివరణ ఇచ్చాడు. తాను ఎలాంటి వివాదాస్పద ప్రకటన చేయలేదని తెలిపాడు.
కావేరీ జలాల వివాదం నేపథ్యంలో కర్ణాటకలో తన సినిమాలు విడుదల చేయబోనని శింబూ ప్రకటించినట్టు కథనాలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ కథనాలపై తీవ్ర చర్చ నడిచింది. దీంతో తాను ఆ ప్రకటన చేయలేదని, అసలు కావేరి జలాల అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చాడు. తన తాజా చిత్రం ’అచ్చం యెంబాథు మదమైయద’ షూటింగ్‌లో భాగంగా శింబూ ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఉన్నానరని, ఈ సినిమాలోని ఓ పాటను అక్కడ చిత్రీకరిస్తున్నారని చిత్రయూనిట్ కూడా వివరణ ఇచ్చింది. మరోవైపు కావేరి నదీ జలాల హక్కు ల పరిరక్షణకు అమ్మ జయలలిత ప్రభుత్వం తీసుకునే చర్యలకు తాము అండగా ఉంటామని దక్షిణ భారత సినీ నటుల సంఘం ప్రకటించింది. తమిళ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తమ పయనం ఉంటుందని విశాల్‌తో సహా పలువురు తమిళ నటులు ప్రకటించారు.