నిన్న కాక మొన్న విజయవాడలో రివాల్వర్ మిస్ఫైర్ అయ్యి ఓ వ్యక్తి గాయపడితే, తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఓ ఎస్ఐ దగ్గరున్న రివాల్వర్ పొరపాటున పేలి, ఆయన ప్రాణాలనే బలిగొంది.
నిన్న కాక మొన్న విజయవాడలో రివాల్వర్ మిస్ఫైర్ అయ్యి ఓ వ్యక్తి గాయపడితే, తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఓ ఎస్ఐ దగ్గరున్న రివాల్వర్ పొరపాటున పేలి, ఆయన ప్రాణాలనే బలిగొంది. కాంకేర్ జిల్లా భానుప్రతాప్ప గ్రామం వద్ద ఓ బస్సులో ప్రయానిస్తున్న ఎస్ఐ వద్ద ఉన్న రివాల్వర్ పొరపాటున మిస్ఫైర్ అయ్యింది. ఆ బుల్లెట్ నేరుగా ఆయనకే తగలడంతో అక్కడికక్కడే ఆ ఎస్ఐ మరణించారు.
సాధారణంగా రివాల్వర్కు ఉండే లీవర్ రిలీజ్ చేస్తేనే అది పేలుతుంది. ఎప్పుడూ దాన్ని లాక్ పొజిషన్లోనే ఉంచుతారు. బుల్లెట్లు లోడ్ చేసే సమయంలో గానీ, మరేదైనా సందర్భంలో గానీ పొరపాటున ట్రిగ్గర్ ఒత్తుకుంటే.. రివాల్వర్ పేలుతుంది. గురువారం కూడా సరిగ్గా అలాగే జరిగి, ఎస్ఐ ప్రాణాలు కోల్పోయారు.