షీనా బోరా బతికే ఉంది: ఇంద్రాణి
సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది.
	ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. షీనా బోరా బతికే ఉందని, అమెరికాలో ఉంటోందని ఉందని పోలీసు ఇంటరాగేషన్ లో ఆమె తల్లి ఇంద్రాణి ముఖార్జియా తెలిపినట్టు సమాచారం. తనపై ఉన్న ద్వేషంతోనే ఆమె ఎవరికీ కనిపించకుండా ఉండిపోయిందని ఇంద్రాణి చెప్పినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
	
	24 ఏళ్ల షీనా బోరా 2012, ఏప్రిల్  24న హత్యకు గురైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇంద్రాణితో పాటు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.  కాగా షీనా అమెరికా వెళ్లిందని మూడేళ్లుగా ఇంద్రాణి చెబుతూ వచ్చింది.
	
	షీనా నిజంగా అమెరికా వెళ్లిందా, లేదా అనేది గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. షీనా హత్యకు గురైన సమయంలో అమెరికా వెళ్లిన ప్రయాణికుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు ఇంటరాగేషన్ సమయంలో పోలీసులకు ప్రశ్నలకు ఇంద్రాణి సరిగా సమాధానం చెప్పలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. సంజీవ్ ఖన్నాను దుమ్మెత్తి పోసినట్టు వెల్లడించాయి.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
