లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు | Sensex opens higher, Nifty reclaims 8750; SBI, TCS lead gainers | Sakshi
Sakshi News home page

లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

Feb 16 2017 9:52 AM | Updated on Sep 5 2017 3:53 AM

రెండు రోజుల నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. టెక్నాలజీ స్టాక్స్, ప్రభుత్వ రంగ బ్యాంకుల మద్దతుతో గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.

ముంబై : రెండు రోజుల నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. టెక్నాలజీ స్టాక్స్, ప్రభుత్వ రంగ బ్యాంకుల మద్దతుతో గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 16 పాయింట్ల లాభంతో 28,171 వద్ద, నిఫ్టీ 2.50 పాయింట్ల లాభంతో 8727 వద్ద ట్రేడవుతున్నాయి. ఐదు అసోసియేట్ బ్యాంకులను ఎస్బీఐ తనలో విలీనం చేసుకోవడానికి కేబినెట్ ఆమోదం తెలుపడంతో ఆ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు షేర్లు 2 శాతం పెరిగాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్‌ మైసూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్ కోర్ లు 6 శాతం చొప్పును ఎగిశాయి.
 
ఇన్ఫోసిస్, సిప్లా, టాటా మోటార్స్, సన్ ఫార్మా లాభపడుతుండగా.. ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, అరబిందో ఫార్మా, భారతీ ఇన్ఫ్రాటెల్, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. అటు డాలర్‍్తో రూపాయి మారకం విలువ 4 పైసలు బలహీనపడి 66.94గా ప్రారంభమైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు కూడా 144 రూపాయలు పెరిగి 29,145 వద్ద ట్రేడవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement