రెండో బ్లాక్ బాక్స్ దొరికింది | Second black box found from Germanwings plane crash site | Sakshi
Sakshi News home page

రెండో బ్లాక్ బాక్స్ దొరికింది

Apr 2 2015 9:02 PM | Updated on Sep 2 2017 11:45 PM

ఫ్రాన్సులోని ఆల్ప్స్ పర్వతాల్లో కుప్పకూలిపోయిన జర్మన్వింగ్స్ విమానంలోని రెండో బ్లాక్ బాక్స్ దొరికింది.

మార్సిలె: ఫ్రాన్సులోని ఆల్ప్స్ పర్వతాల్లో కుప్పకూలిపోయిన జర్మన్వింగ్స్ విమానంలోని రెండో బ్లాక్ బాక్స్ దొరికింది. తొమ్మిది రోజుల గాలింపు తర్వాత ఇది లభ్యమైంది. ఇందులో రికార్డయిన సమాచారం ఆధారంగా ఈ ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలిసే అవకాశముంది.  రెండో బ్లాక్ బాక్స్ లో విమానానికి సంబంధించిన సాంకేతిక సమాచారంతో పాటు ప్రమాదానికి ముందు చివరి నిమిషాల్లో ఏం జరిగిందనేది వెల్లడికానుంది.

కో-పైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చేశాడని అంతకుముందు దొరికిన మొదటి బ్లాక్ బాక్స్ లోని సమాచారం ఆధారంగా నిర్ధారణకు వచ్చారు. అతడు మానసిక రోగి అని తేల్చారు. తన పేరు విశ్వమంతటా మారు మోగిపోవాలన్న దుష్టచింతనతో అతడీ ఘోరకృత్యానికి పాల్పడ్డాడు.

Advertisement
 
Advertisement
Advertisement