అంబానీకి షాకిచ్చిన సుప్రీం | Sakshi
Sakshi News home page

అంబానీకి షాకిచ్చిన సుప్రీం

Published Fri, Jan 6 2017 1:13 PM

అంబానీకి షాకిచ్చిన సుప్రీం - Sakshi

న్యూఢిల్లీ:  ఎయిర్ సెల్  మాక్సిస్  2జీ స్పెక్ట్రం కేసులో సుప్రీంకోర్టు  ఆర్ కాం కి షాకిచ్చింది.  మలేషియా  కంపెనీ  మాక్సిస్ నుంచి 2 జి లైసెన్స్ ను మరో టెలికం కంపెనీ బదిలీ చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. మనీ లాండరింగ్   కేసు కొనసాగుతుండగా నే   అనిల్ అంబానీ నేతృత్వంలోని  రిలయన్స్ కమ్యూనికేషన్స్  మధ్య ప్రతిపాదిత  ఒప్పందంపై  సుప్రీంకోర్టు  తాత్కాలికంగా స్టే విధించింది. ఈ కేసు విచారణ సందర్భంగా  శుక్రవారం   నిందితులపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  నిందితులు నలుగురూ  స్పెషల్  కోర్టుముందు విధిగా  హాజరు కావాలంటూ సుప్రీం  కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాపార వేత్త  ఆనంద కృష్ణన్,  మలేసియా సంస్థ  మాక్సిస్ కు చెందిన అగస్టస్ రాల్ఫ్ మార్షల్, మరో ఇద్దరు జనవరి 27లోపు కోర్టుముందు హాజరు కావాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణకు ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.

విచారణకు ప్రమోటర్లు అంగీకరించకపోతే  2016లో ఎయిర్ సెల్ కు కేటాయించిన 2 జీ స్పెక్ట్రంను లైసెన్స్ ను సీజ్ చేయాలని తెలిపింది. నిందితులు కోర్టు ముందు హాజరు కాకపోతే 2 వారాల్లోగా  దీన్ని విక్రయించాల్సిందిగా  టెలికాం శాఖకు స్పష్టం చేసింది.  అంతేకాదు ​​ ఈ  లైసెన్సు ద్వారా ఆర్జించిన  ఆదాయాన్ని  కూడా   స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశించింది.  ఈ  2 జి లైసెన్స్ బదిలీ ద్వారా చందాదారుల ప్రతికూల ప్రభావాన్ని నివారించేలా  చూడాలని ప్రభుత్వాన్ని కోరింది.

కాగా సంచలనం రేపిన ఎయిర్ సెల్ మాక్సిస్  కుంభకోణంలో  2014 ఆగస్టులో మారన్ సోదరులతో బాటు మలేసియా వ్యాపారవేత్త  ఆనంద్ కృష్ణన్ మీద, మలేసియాకు చెందిన మరో వ్యక్తి అగస్టస్ రాల్ఫ్ మార్షల్ పైన, సన్ డైరెక్ట్, మాక్సిస్ కమ్యూనికేషన్, సౌత్ ఏషియా ఎంటర్టైన్మెంట్ హోల్డింగ్స్, ఆస్ట్రో ఆల్ ఏషియా నెట్ వర్క్ మీద సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  
  

Advertisement

తప్పక చదవండి

Advertisement