మమ్మల్ని కాపాడండి: విజయకాంత్ | Save us from AIADMK violence, pleads Vijayakanth | Sakshi
Sakshi News home page

మమ్మల్ని కాపాడండి: విజయకాంత్

Sep 28 2014 3:48 PM | Updated on May 24 2018 12:10 PM

మమ్మల్ని కాపాడండి: విజయకాంత్ - Sakshi

మమ్మల్ని కాపాడండి: విజయకాంత్

అన్నాడీఎంకే కార్యకర్తల హింసాకాండ నుంచి తమను కాపాడాలని తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎండీకే అధ్యక్షుడు ఎ.విజయకాంత్ కోరారు.

చెన్నై: అన్నాడీఎంకే కార్యకర్తల నుంచి తమను కాపాడాలని తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎండీకే అధ్యక్షుడు ఎ.విజయకాంత్ కోరారు. ఈ మేరకు గవర్నర్ కె. రోశయ్యను కలిసి విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే కార్యకర్తల నుంచి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు రక్షణ కల్పించాలని గవర్నర్ ను కోరినట్టు భేటీ అనంతరం విజయకాంత్ తెలిపారు.

తమ పార్టీ అధినేత్రి జయలలితకు కోర్టు జైలు శిక్ష విధించడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా దౌర్జన్యకాండకు దిగారు. పుదుకొట్టయ్, తిరుచ్చిలోని డీఎండీకే కార్యాలయాలపై అన్నాడీఎంకే మద్దతుదారులు దాడి చేశారు. రెండు ప్రభుత్వ బస్సులను తగులబెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement