కేదార్నాథ్ నడిచి వెళ్లనున్న రాహుల్! | Rahul Gandhi to trek to Kedarnath shrine | Sakshi
Sakshi News home page

కేదార్నాథ్ నడిచి వెళ్లనున్న రాహుల్!

Apr 22 2015 8:08 PM | Updated on Sep 3 2017 12:41 AM

కేదార్నాథ్ నడిచి వెళ్లనున్న రాహుల్!

కేదార్నాథ్ నడిచి వెళ్లనున్న రాహుల్!

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం నాడు కేదార్నాథ్ ఆలయానికి నడిచి వెళ్లనున్నారు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం నాడు కేదార్నాథ్ ఆలయానికి నడిచి వెళ్లనున్నారు. గురువారం డెహ్రాడూన్ వెళ్లి, అక్కడినుంచి శుక్రవారం నాడు నడిచి వెళ్తారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ మీడియా ఇన్చార్జి సురేంద్రకుమార్ చెప్పారు. పార్టీ ఉత్తరాఖండ్ వ్యవహారాల ఇన్చార్జి అంబికాసోనీతో కలిసి గురువారం ఉదయం ఆయన జాలీగ్రాంట్ ఎయిర్పోర్టుకు వెళ్తారు.

అక్కడినుంచి గౌరీకుండ్ వెళ్లి, లించౌలి ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఒకరాత్రి విశ్రాంతి తీసుకుని, శుక్రవారం నాడు కేదార్నాథ్ ఆలయానికి నడిచి వెళ్తారు. ఆయనతోపాటు ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ, మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. ఇంత పెద్ద స్థాయి నాయకుడు కేదార్నాథ్ వెళ్లి పరమశివుడిని దర్శించుకోవడం ఇదే తొలిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement