వార్రూమ్లో కాంగ్రెస్ సీఎంల సమావేశం | Rahul Gandhi meet Congress CMs to plan for Lok Sabha polls | Sakshi
Sakshi News home page

వార్రూమ్లో కాంగ్రెస్ సీఎంల సమావేశం

Dec 27 2013 10:39 AM | Updated on Jul 29 2019 5:31 PM

వార్రూమ్లో కాంగ్రెస్ సీఎంల సమావేశం - Sakshi

వార్రూమ్లో కాంగ్రెస్ సీఎంల సమావేశం

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం అయ్యింది.

న్యూఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం అయ్యింది. వార్రూమ్లో జరుగుతున్న ఈ సమావేశంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై ముఖ్యమంత్రులతో రాహుల్ చర్చిస్తున్నారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేయటంతోపాటు లోకసభ ఎన్నికల్లో కొంతైనా పుంజుకునేలా చేసేందుకు చిన్నబాబు  తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఈ సమావేశంలో  ప్రధానంగా లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లోకపాల్‌ను ఏర్పాటు చేస్తునందున దీనికి అనుగుణంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లోకాయుక్తలను ఏర్పాటు చేయటంతోపాటు ఈ వ్యవస్థ అత్యంత సమర్థంగా అమలు జరిగేందుకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించనున్నారు.

ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల నాటికి నిత్యావసర వస్తువుల ధరలను ఏ విధంగానైనా అదుపుచేసి, తద్వారా ప్రజలకు కాంగ్రెస్‌పై ఉన్న కోపతాపాలను తగ్గించేందుకు ప్రయత్నించాలని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రులకు సూచించనున్నారు. లోకాయుక్త, లోక్‌పాల్‌లను సమర్థవంతంగా అమలు చేయటం ద్వారా అవినీతిపై కాంగ్రెస్ చిత్తశుద్దితో చేస్తున్న పోరాటం చేస్తోందన్న విశ్వాసాన్ని ప్రజల్లో  కలిగించాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లేలా కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement