సుత్తితో కొట్టి కొడుకును చంపిన ఎన్నారై | Nri charged with murder over ‘attack that killed baby boy and left one-year-old twin sister in coma | Sakshi
Sakshi News home page

సుత్తితో కొట్టి కొడుకును చంపిన ఎన్నారై

Mar 30 2017 6:11 PM | Updated on Sep 5 2017 7:30 AM

సుత్తితో కొట్టి కొడుకును చంపిన ఎన్నారై

సుత్తితో కొట్టి కొడుకును చంపిన ఎన్నారై

బ్రిటన్‌లో ఓ భారత సంతతి వ్యక్తి తన కొడుకును సుత్తితో కొట్టి చంపాడు.

లండన్‌: బ్రిటన్‌లో ఓ భారత సంతతి వ్యక్తి తన కొడుకును సుత్తితో కొట్టి చంపడంతోపాటు కూతురిపైనా దాడి చేయడంతో ఆమె పూర్తిగా చూపును, పాక్షికంగా వినికిడి శక్తిని కోల్పోయింది. కవల పిల్లలైన వీరి వయసు ఏడాదే. బిద్యా సాగర్‌ దాస్‌(33) అనే వ్యక్తి లండన్‌లోని ఫిన్స్‌బరీ పార్క్‌ సమీపంలో ఓ ఇంట్లో తన భార్య క్రిస్టినెలా, కూతురు మారియా, కొడుకు గాబ్రియేల్‌లతో కలిసి ఉండేవాడు. దగ్గర్లోని ఓ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేసే దాస్‌.. మార్చి 18న పిల్లలపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటన జరిగిన 20 గంటల తర్వాత అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని థేమ్స్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును క్రౌన్ కోర్టుకు బదిలీ చేయాలని మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని స్థానికులను పోలీసులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement