సుజన, బాబుపై పేలుతున్న పటాకులు! | netizens criticise chandrababu, sujana chowdary | Sakshi
Sakshi News home page

సుజన, బాబుపై పేలుతున్న పటాకులు!

Jan 26 2017 2:27 PM | Updated on Mar 28 2019 5:27 PM

సుజన, బాబుపై పేలుతున్న పటాకులు! - Sakshi

సుజన, బాబుపై పేలుతున్న పటాకులు!

ప్రత్యేక హోదా కోసం ఆంధ్రరాష్ట్రం పోరుబాట పట్టింది. యువత, విద్యార్థులు, ప్రజలు ప్రత్యేక హోదాకు సై అంటూ కదం తొక్కుతున్నారు.

హైదరాబాద్‌: ప్రత్యేక హోదా కోసం ఆంధ్రరాష్ట్రం పోరుబాట పట్టింది. యువత, విద్యార్థులు, ప్రజలు ప్రత్యేక హోదాకు సై అంటూ కదం తొక్కుతున్నారు. వైజాగ్‌లో ఎన్ని ఆంక్షలు పెట్టినా, నిషేధాజ్ఞలు విధించినా.. వాటిని ధిక్కరించి పోరుకు సై అంటు కదిలారు. ఆంధ్రప్రదేశ్‌ అంతటా హోదా నినాదం హోరెత్తుతూనే ఉంది. వైజాగ్‌లో సాయంత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం కొవ్వొత్తుల మహార్యాలీలో పాల్గొనబోతున్నారు.

హోదా కోసం ప్రజలు ఇంతగా తపిస్తున్నా అధికారంలో ఉన్న నేతలకు ప్రజాకాంక్ష ఏమాత్రం పట్టినట్టు కనిపించడం లేదు. కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి ప్రత్యేక హోదా అవసరమే లేదంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. 'ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం. ఇంకా దాని గురించి మాట్లాడడం అనవరం' అంటూ వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టు స్ఫూర్తిగా తీసుకొనే వారు ఏ కోళ్లపందాలో, పందుల పందాలో నిర్వహించుకోవాలని ఆయన నోరుపారేసుకోవడంతో.. ఆయన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే సుజనా చౌదరి వ్యాఖ్యలపై సినీ రచయిత చిన్ని కృష్ణ ఘాటుగా స్పందించగా.. సోషల్‌ మీడియాలో సైతం సుజన, సీఎం చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఆంధ్ర నెటిజన్లు సోషల్‌ మీడియాలో చేసిన కామెంట్లు, పోస్టులు ఇవి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement