‘నేను లోకల్‌’ ఎర్లీ రివ్యూ..!


నేచురల్‌ స్టార్‌ నాని, బబ్లీ బ్యూటీ కీర్తి సురేశ్‌ జంటగా.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు తెరకెక్కించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ’నేను లోకల్‌’.. వరుస విజయాలతో దూసుకుపోతున్న నానీ హీరోగా వస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకులను పలుకరించింది. భారీ అంచనాలతో దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా రూపొందిన ఈ సినిమాపై సోషల్‌ మీడియాలో సినీ ప్రేమికుల నుంచి పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. నాని ఒక్కడే వన్‌ మ్యాన్‌ షోతో సినిమాను నడిపించాడని, అయినా నాని యాక్టింగ్‌, కామెడీ సీన్లు సినిమాలో పండాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటిలాగే కీర్తి సురేష్‌ అందంగా ఆకట్టుకునేలా ఉందని చెప్తున్నారు. ’నేను లోకల్‌’ సినిమాపై ట్విట్టర్‌లో వెలువడిన పలు ఎర్లీ ఒపీనియన్స్‌ ఇవి.

మరోవైపు సినీ ప్రముఖుల నుంచి కూడా నానికి, నేను లోకల్‌ చిత్రయూనిట్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఒక అమ్మాయి తెల్లవారు జామున నాలుగింటికి లేచి చదువుతోందంటే అది మార్చి అని అర్థం, అదే ఒక అబ్బాయి తెల్లవారు జామున నాలుగింటికి లేచి చదువుతున్నాడంటే అది సెప్టెంబర్’ అని అర్థం అంటూ సహజమైన నటనతో నాని ఇప్పటికే ట్రైలర్‌లో అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. బుద్ధిమంతుడులా అమ్మానాన్నల కోసం కాలేజీకి వెళతానంటూనే.. ఎంబీఏ చదువుతా అమ్మాయిని ఫాలో అవుతానంటూ వాళ్లకి పంచ్‌ వేస్తాడు. హీరోయిన్‌ను ఫాలో అవుతూ ఆమెను డిస్ట్రబ్‌ చేస్తూ ఆమె తండ్రితో వీడు జండూబామ్‌కి తలనొప్పి రప్పించే రకంగా ఉన్నాడంటూ.. నాని తన నటనతో ట్రైలర్‌లో హల్‌చల్‌ చేశాడు.
 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top