ఓ దళిత యువతిపై తన కుమారుడు అమానుషంగా ప్రవర్తించడంతో ఆవేదన చెందిన తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం బిల్హార్ ప్రాంతంలో వెలుగుచూసింది.
కొడుకు చేసిన పనికి తండ్రి ఆత్మహత్య
Oct 16 2014 7:57 PM | Updated on Nov 6 2018 7:56 PM
కాన్పూర్:ఓ దళిత యువతి పట్ల తన కుమారుడు అమానుషంగా ప్రవర్తించడంతో ఆవేదన చెందిన తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం బిల్హార్ ప్రాంతంలో వెలుగుచూసింది. తన కుమారుడు చేసిన నిర్వాకాన్ని అవమానంగా భావించిన ఇంద్రిస్(45) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.19 ఏళ్ల దళిత బాలికకు విషం పట్టించాలని ఇంద్రిస్ కుమారుడు ప్రయత్నించాడు. గత ఐదు రోజుల క్రితం ఆ బాలిక ఇంట్లోకి ప్రవేశించిన ఆ యువకుడు ఆమె పట్ల మృగంలా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న విషాన్ని బాలిక చేత తాగించాడు. అనంతరం ఆ యువకుడు అక్కడ్నుంచి పారిపోగా, ఆ బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. దీనిపై బాలిక చెప్పిన వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ విషయాన్ని అవమానంగా భావించిన కుమారుని తండ్రి గత రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Advertisement
Advertisement