మళ్లీ పరిశ్రమల వెనుకంజ.. | Industries are their retreat again . | Sakshi
Sakshi News home page

మళ్లీ పరిశ్రమల వెనుకంజ..

Oct 12 2013 1:29 AM | Updated on Sep 1 2017 11:34 PM

మళ్లీ పరిశ్రమల వెనుకంజ..

మళ్లీ పరిశ్రమల వెనుకంజ..

జూలైలో కాస్త పర్వాలేదనిపించిన పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు మళ్లీ మందగమనంలోకి జారిపోయింది. వృద్ధి రేటు కేవలం 0.6 శాతంగా నమోదయ్యింది. జూలైలో వృద్ధి రేటు 2.8 శాతంకాగా, గత ఏడాది ఆగస్టులో ఈ రేటు 2 శాతంగా ఉంది. మే (మైనస్ 2.5 శాతం) జూన్ (మైనస్ 1.8 శాతం)లలో క్షీణతలో నడిచిన వృద్ధి సూచీ జూలైలో కాస్త మెరుగుపడ్డంతో ఆర్థిక విధాన నిర్ణేతలు, విశ్లేషకులు కొంత ఊరట పొందారు.

 న్యూఢిల్లీ: జూలైలో కాస్త పర్వాలేదనిపించిన పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు మళ్లీ మందగమనంలోకి జారిపోయింది. వృద్ధి రేటు కేవలం 0.6 శాతంగా నమోదయ్యింది. జూలైలో వృద్ధి రేటు 2.8 శాతంకాగా, గత ఏడాది ఆగస్టులో ఈ రేటు 2 శాతంగా ఉంది. మే (మైనస్ 2.5 శాతం) జూన్ (మైనస్ 1.8 శాతం)లలో క్షీణతలో నడిచిన వృద్ధి సూచీ జూలైలో కాస్త మెరుగుపడ్డంతో ఆర్థిక విధాన నిర్ణేతలు, విశ్లేషకులు కొంత ఊరట పొందారు. అయితే తాజా ఫలితంతో ఈ ఊరట నీరుగారిపోయింది. తయారీ, వినియోగ వస్తువుల విభాగం సహా పలు రంగాల పేలవ పనితీరు తాజా నిరుత్సాహ ఫలితానికి కారణం. 2012 ఆగస్టుతో పోల్చి, 2013 ఆగస్టులో వివిధ పరిశ్రమల పనితీరును పరిశీలిస్తే...
 
     తయారీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన ఈ రంగంలో అసలు వృద్ధి నమోదుకాకపోగా మైనస్‌లోకి జారిపోయింది. 2.4% వృద్ధి నుంచి మైనస్ 0.1%కి క్షీణించింది.
 
     మైనింగ్: సూచీలో 14% వెయిటేజ్ ఉన్న ఈ రంగం క్షీణతలోనే కొనసాగుతోంది. అయితే క్షీణత -0.3 శాతం నుంచి -0.2 శాతానికి తగ్గింది.
 
     విద్యుత్: ఈ రంగం మాత్రం మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. ఉత్పత్తి వృద్ధి రేటు 1.9 శాతం నుంచి 7.2 శాతానికి ఎగసింది.
 
     కన్జూమర్ డ్యూరబుల్స్: ఈ రంగంలో ఉత్పత్తి -7.6 శాతం క్షీణించింది.
 
     క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు సూచికైన క్యాపిటల్ గూడ్స్ రంగం -2 శాతం క్షీణించింది. 2012 ఆగస్టులో ఈ క్షీణత 4.4 శాతం.
 
 ఐదు నెలల్లో...: ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) వృద్ధి రేటు 0.2ు% నుంచి 0.1%కి పడిపోయింది. తయారీ రంగం  .. 2012 ఆగస్టులో వృద్ధి లేకుండా నిశ్చలంగా ఉండగా.. ఈ ఆగస్టులో   మైనస్ 0.1 శాతంలోకి జారిపోయింది. విద్యుత్ రంగంలో సైతం వృద్ధి 4.8 శాతం నుంచి 4.5 శాతానికి జారింది. అయితే  క్యాపిటల్ గూడ్స్ రంగం విషయానికి వస్తే- 2013 ఆగస్టులో ఈ రంగం కాస్త మెరుగుపడింది. ఈ రంగంలో 14.4 క్షీణత నుంచి 0.8 శాతం వృద్ధిలోకి మళ్లింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement