ఒకే కాల్లో వందమందితో.. | Hike launches free group calling, can connect up to 100 people | Sakshi
Sakshi News home page

ఒకే కాల్లో వందమందితో.. ~

Sep 11 2015 1:36 PM | Updated on Sep 3 2017 9:12 AM

ఒకే కాల్లో వందమందితో..

ఒకే కాల్లో వందమందితో..

ఒకే కాల్ తో ఉచితంగా వందమందితో మాట్లాడే అవకాశాన్ని హైక్ మెస్సెంజర్ తీసుకొచ్చింది.

న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక వేదిక హైక్ మెస్సెంజర్ సరికొత్త అవకాశాన్ని మొబైల్ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటివరకు మెస్సేంజర్గా పనిచేసిన హైక్.. తాజాగా ఉచిత గ్రూప్ కాల్ కూడా చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించింది. ఒకే ఒక్క కాల్తో ఏకంగా ఒకే సారి వందమందితో ఉచితంగా మాట్లాడే అవకాశం కల్పిస్తూ సేవలు ప్రారంభించింది. 

హైక్ మెస్సేంజర్ యజమాని టెలికాం దిగ్గజం సునీల్ మిట్టల్ తనయుడు కెవిన్ మిట్టల్ శుక్రవారం ఈ కొత్త సదుపాయం ప్రారంభించారు. ప్రస్తుతానికి 4జీ, వైఫై ద్వారా ఈ సౌకర్యాన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు అందిస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికల్లా ఐవోఎస్, విండోస్ ఫోన్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement