జమ్మూకశ్మీర్ లో గవర్నర్ పాలనకు కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో గవర్నర్ పాలనకు కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. అతిపెద్ద పార్టీలుగా అవరించిన పీడీపీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు సాగించినా ఒక అవగాహనకు రాలేకపోయాయి.
మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగలేనంటూ ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేయడంతో సంక్షోభం మరింత ముదిరింది. దీంతో గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా రాష్ట్రంలో తాజా పరిస్థితిని తెలియజేస్తూ గురువారం కేంద్రానికి నివేదిక పంపారు. ఫలితంగా గవర్నర్ పాలనకు కేంద్రం సిఫారసు చేసింది.