
పదేపదే ఈవ్ టీజింగ్.. యువతి ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్లో కొంతమంది యువకులు తనను పదే పదే ఈవ్ టీజింగ్ చేస్తుండటంతో ఆ వేధింపులు భరించలేని యువతి (20) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఉత్తరప్రదేశ్లో కొంతమంది యువకులు తనను పదే పదే ఈవ్ టీజింగ్ చేస్తుండటంతో ఆ వేధింపులు భరించలేని యువతి (20) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చార్పాన్ ఖుర్ద్ గ్రామంలో జరిగింది. ఇటీవలే ఆమె బీఎస్ఎఫ్ ప్రిలిమినరీ పరీక్షలలో ఉత్తీర్ణత పొంది, మెయిన్స్ కోసం ప్రిపేరవుతోంది.
గత శుక్రవారం నాడే ఆమె తనను ఇద్దరు యువకులు పదే పదే వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో వాళ్లను కస్టడీలోకి తీసుకుని, తర్వాత వదిలిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అయినా వాళ్ల వేధింపులు ఆగకపోవడంతో ఆదివారం రాత్రి ఆమె ఉరేసుకుని మరణించింది. దోషులపై కఠినాతి కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమితాబ్ యశ్ తెలిపారు. నలుగురు వ్యక్తులపై కేసు దాఖలు చేశామని, ఒకరిని అరెస్టు చేశామని ఎస్పీ బ్రిజేశ్ సింగ్ చెప్పారు.