
మాజీ కెప్టెన్‌కు మళ్లీ గంగూలీ ఝలక్!
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీకి మరోసారి సీనియర్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఝలక్ ఇచ్చాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీకి మరోసారి సీనియర్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఝలక్ ఇచ్చాడు. తన కల్పిత ఐపీఎల్ జట్టులో ధోనీకి స్థానం కల్పించలేదు. ధోనీ స్థానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ యంగ్‌స్టర్ రిషబ్ పంత్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలను గంగూలీ అప్పగించడం గమనార్హం.
కొన్నిరోజుల కిందట ధోనీ టీ-20లకు పనికిరాడంటూ పరోక్షంగా గంగూలీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వన్డేలలో ధోనీ చాంపియన్ అన్న విషయంలో ఎవరికీ సందేహం లేదని, కానీ టీ-20లకు వచ్చేసరికి గత పదేళ్లలో అతను పెద్దగా పరుగులు చేయలేకపోయాడని, అతని టీ-20 సామర్థ్యం మీద తనకు నమ్మకం లేదని గంగూలీ చెప్పుకొచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినా గంగూలీ పట్టించుకోలేదు. ఇక, ఇంతకుముందు ఆస్ట్రేలియా ఆటగాడు మైఖేల్ క్లార్క్ ప్రకటించిన తన ఐపీఎల్ డ్రీమ్ టీమ్‌లోనూ ధోనీకి స్థానం లభించని సంగతి తెలిసిందే. ధోనీ గత కొన్నాళ్లుగా మైదానంలో మెరుగ్గా ఆడలేకపోతున్న నేపథ్యంలో అతని ఆటతీరుపై క్రమంగా విమర్శలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.
గంగూలీ ఐపీఎల్ డ్రీమ్ టీమ్ సభ్యులు వీరే: విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, స్టీవెన్ స్మిత్, ఏబీ డివిలియర్స్, నితీష్ రాణా, మనీష్ పాండే, రిషభ్ పంత్, సునీల్ నరైన్, అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్, క్రిస్ మోరిస్
After much thought and some hard decisions this is my #IPLFantasy dream team.Which players are a part of your team?#VIVOIPL @SGanguly99 pic.twitter.com/8fHVWs0kCR
— IPL Fantasy League (@IPLFantasy) 24 April 2017