పూరీలో కుప్పకూలిన రెండస్థుల భవనం | Four killed in Odisha building collapse | Sakshi
Sakshi News home page

పూరీలో కుప్పకూలిన రెండస్థుల భవనం

Sep 8 2013 9:37 AM | Updated on Sep 1 2017 10:33 PM

పూరీ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున రెండు అంతస్థుల భవనం పేకమేడలా కుప్పకులిన ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు.

ఒడిశాలోని పూరీ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున రెండు అంతస్థుల భవనం పేకమేడలా కుప్పకూలిన ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారి బాలికలు కూడా ఉన్నారని చెప్పారు. ఆ ఘటనలో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారని తెలిపారు. వారిని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు చెప్పారు.

 

ఆ దుర్ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు,  పురపాలక సంఘం ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

 

ఆ భవనంలోని వారంతా నిద్రిస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. దాదాపు శతాబ్దం క్రితం ఆ భవనం నిర్మించారని భావిస్తున్నట్లు వారు వివరించారు. కుప్పకులిన భవనం యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని, అలాగే అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement