సభ వాయిదా... అబ్బే లేదు! | Faux pas averted in Lok Sabha | Sakshi
Sakshi News home page

సభ వాయిదా... అబ్బే లేదు!

Apr 29 2015 7:59 PM | Updated on Mar 9 2019 3:08 PM

సభ వాయిదా... అబ్బే లేదు! - Sakshi

సభ వాయిదా... అబ్బే లేదు!

లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తత్తరపాటుకు గురయ్యారు.

న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తత్తరపాటుకు గురయ్యారు. సభలో గందరగోళం సృష్టించే సభ్యులను కళ్లెం వేసే సభాధ్యక్షురాలే కంగారులో చిన్నపొరపాటు చేశారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం పొందాల్సివుండగానే సభను వాయిదా వేసినట్టు స్పీకర్ ప్రకటించారు. బయటకు వెళ్లేందుకు సభ్యులంతా లేచి నిలబడ్డారు. మరోవైపు బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పీకర్ ప్రకటనతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇంతలో సహాయకుడు అప్రమత్తం చేయడంతో మహాజన్ పొరపాటు గ్రహించారు. సభ వాయిదా పడలేదని, సభ్యులంతా కూర్చోవాలని కోరారు. తర్వాత సభకు క్షమాపణ చెప్పారు. గందరగోళంలో చిన్నచిన్న పొరపాట్లు సహజమని సర్దిచెప్పుకున్నారు. తర్వాత  అప్రాప్రియేషన్ బిల్లును మూజువాణి ఓటుతో లోక్ సభ ఆమోదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement