ఆ వాహనాలను మార్చడం సాధ్యంకాదు | Emission Norms: Supreme Court Tells Automobile Firms Not To Delay BS-IV Roll Out | Sakshi
Sakshi News home page

ఆ వాహనాలను మార్చడం సాధ్యంకాదు

Mar 28 2017 3:32 PM | Updated on Sep 5 2017 7:20 AM

బీఎస్‌–4కు లోబడి వాహనాలను మార్పు చేయడం సాధ్యంకాదని తయారీదారులు సుప్రీంకోర్టుకు వెల్లడించారు.

న్యూఢిల్లీ: దేశంలోని వాహన తయారీ సంస్థల వద్ద ప్రస్తుతమున్న బీఎస్‌–3 వాహనాలను కొత్త ఉద్గార నిబంధనలైన బీఎస్‌–4కు లోబడి అన్ని వాహనాలను మార్పు చేయడం సాధ్యమయ్యేది కాదని తయారీదారులు సుప్రీంకోర్టుకు వెల్లడించారు. బీఎస్‌–3 వాహనాలను బీఎస్‌–4 వాహనాలుగా మార్చేందుకు ఎంతమేర ఖర్చు అవుతుందని తయారీదారులను గతంలో సుప్రీంకోర్టు అడిగిన నేపథ్యంలో తయారీదారులు సోమవారం ఈ మేరకు కోర్టుకు తెలియజేశారు.

మరోవైపు బీఎస్‌–4 నిబంధనలను వాహన తయారీదారులు వ్యతిరేకించడంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సమాంతరంగా ఏమైనా వాదనలు జరుగుతున్నాయా..? లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాల్సిందిగా జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) కేంద్రాన్ని ఆదేశించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement