జర్మనీలోని మ్యూనిక్ నగరంలో ఉగ్రబీభత్సానికి తెగబడ్డ సాయుధుదు.. ప్రధానంగా పిల్లలనే లక్ష్యంగా చేసుకున్నాడా..
జర్మనీలోని మ్యూనిక్ నగరంలో ఉగ్రబీభత్సానికి తెగబడ్డ సాయుధుదు.. ప్రధానంగా పిల్లలనే లక్ష్యంగా చేసుకున్నాడా.. అభంశుభం తెలియని బాలలను చంపేందుకు ప్లాన్ వేశాడా.. అంటే పోలీసులు ఔనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మ్యూనిక్ నగరంలోని ఒలింపిక్ పార్క్ సమీపంలో 18 ఏళ్ల ఇరానీయన్ సాయుధుడు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. సరిగ్గా అతడు కాల్పులకు దిగిన సమయంలోనే ఒలింపిక్ పార్క్ సమీపంలోని మేక్‌డొనాల్డ్ ఔట్‌లెట్‌లో పిల్లలకు ఆహారం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు ఫేస్‌బుక్‌లో ఓ నకిలీ ప్రకటన వెలువడింది. ఈ నకిలీ ఫేస్‌బుక్ ప్రకటనపై విచారణ జరుపుతున్నట్టు మ్యూనిక్ పోలీసు చీఫ్ హబెర్చస్ అండ్రె తెలిపారు. సాయుధు కాల్పులు దిగిన సమయానికే అక్కడ ఉచిత ఆహారం పంపిణీ చేస్తున్నట్టు ప్రకటన ఇవ్వడం వెనుక పిల్లలను సంఘటన స్థలానికి రప్పించే ఉద్దేశం ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.