ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రత్యేకమైన ఆశ్రయ్ డిపాజిట్ ప్లస్(14 నెలలు) ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది.
ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రత్యేకమైన ఆశ్రయ్ డిపాజిట్ ప్లస్(14 నెలలు) ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది. రూ.25 లక్షల లోపు డిపాజిట్లపై ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లు, ట్రస్ట్ ఇన్వెస్టర్లకు 10.76 శాతం వార్షిక రాబడి, ప్రాధాన్యత వినియోగదారులకు (రక్షణ సిబ్బంది, సీనియర్ సిటిజన్లు, డీహెచ్‌ఎఫ్‌ఎల్ వినియోగదారులు)11.26 శాతం వార్షిక రాబడి లభిస్తుంది. రూ.25 లక్షలకు మించిన డిపాజిట్లపై 11.01%, 11. 51 శాతం వార్షిక రాబడి ఇస్తారు. తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు అధిక భద్రత, అత్యున్నత రుణ నాణ్యతను సూచించే కేర్ డబుల్‘ ఏ’ ప్లస్ రేటింగ్ ఉందని సంస్థ పేర్కొంది. కనీస మొత్తం రూ.10,000 (మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కింద అయితే రూ.20,000) అని వివరించింది.