అక్కడ 500, 1000 నోట్లు చెల్లుబాటు | Dance bars in Maharashtra unaffected | Sakshi
Sakshi News home page

అక్కడ 500, 1000 నోట్లు చెల్లుబాటు

Nov 29 2016 11:21 AM | Updated on Oct 8 2018 5:45 PM

అక్కడ 500, 1000 నోట్లు చెల్లుబాటు - Sakshi

అక్కడ 500, 1000 నోట్లు చెల్లుబాటు

మహారాష్ట్ర, ముంబైలలోని డాన్స్‌ బార్స్‌లో మాత్రం ఈ నోట్లు చెలామణి అవుతున్నాయి.

ముంబై: ప్రస్తుతం 1000 రూపాయల నోటును బ్యాంకు ఖాతాలో జమచేసుకోవడం మినహా ఎక్కడా చెల్లుబాటు కాదు. ఇక పాత 500 రూపాయల నోటు పరిస్థితి కూడా దాదాపు ఇంతే. కాకపోతే పరిమితంగా అత్యవసర సేవలు, సేవా రంగాల్లో చెల్లించేందుకు మినహాయింపునిచ్చారు. పాత నోట్లు వాణిజ్యపరంగా చెల్లుబాటు కావడం లేదు. కాగా మహారాష్ట్ర, ముంబైలలోని డాన్స్‌ బార్స్‌లో మాత్రం ఈ నోట్లు చెలామణి అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేశాక చాలా రంగాలపై ప్రభావం పడగా, డాన్స్‌ బార్స్‌ మాత్రం మునుపటిలా వ్యాపారం సాగుతోంది.

ముంబై సహా మహారాష్ట్రలో చాలా ప్రాంతాల్లో అక్రమంగా డాన్స్‌ బార్స్‌ నడుపుతున్నారు. వీటికి తరచూ రాజకీయ నాయకులు, గ్యాంగ్‌​స్టర్స్‌, వ్యాపారవేత్తలు వస్తుంటారు. ఇక్కడ ఎక్కువగా బ్లాక్‌ మనీ చెలామణి అవుతుంటుంది. మహిళా డాన్సర్లపై పాత నోట్లను విసురుతుంటారని జాతీయ మీడియా వెల్లడించింది. అంతేగాక నకిలీ నోట్లు మారుస్తుంటారు. నోట్ల మార్పిడిలో డాన్సర్లది కీలక పాత్రని, డాన్స్‌ బార్స్‌ ఆపరేటర్లకూ ప్రమేయముందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement