అప్పు తీర్చలేక.. మసాజ్ మహిళ హత్య!! | Chinese graduate kills masseur to pay off debt | Sakshi
Sakshi News home page

అప్పు తీర్చలేక.. మసాజ్ మహిళ హత్య!!

Jul 30 2014 10:20 AM | Updated on Aug 13 2018 3:45 PM

అప్పు తీర్చలేక.. మసాజ్ మహిళ హత్య!! - Sakshi

అప్పు తీర్చలేక.. మసాజ్ మహిళ హత్య!!

చైనాలో అప్పుల్లో మునిగిపోయిన కాలేజి విద్యార్థి.. మసాజ్ చేస్తానన్న మహిళను హతమార్చాడు.

చైనాలో అప్పుల్లో మునిగిపోయిన కాలేజి విద్యార్థి.. మసాజ్ చేస్తానన్న మహిళను హతమార్చాడు. దాంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. షెన్ అనే ఇంటిపేరు గల బాధితురాలి మృతదేహాన్ని గువాంక్సి ఝువాంగ్ ప్రాంతంలో ఉన్న ఆమె అపార్టుమెంట్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. వు అనే ఇంటిపేరు గల నిందితుడిని అతడి ఇంట్లోనే అరెస్టు చేశారు. షెన్ గురించి తనకు ఇంటర్నెట్ ద్వారా తెలిసిందని వు చెప్పాడు. గత మంగళవారం ఆమె ఇంటికి వెళ్లాడు. అతడిని ఆమె చూస్తుండగానే.. సుత్తితో దాడి చేసి, ఆమె తలమీద కొట్టి చంపేశాడు.

తర్వాత ఆమె మృతదేహాన్ని ఓ బెడ్డింగ్లో చుట్టాడు. తర్వాత ఆమె ఇంట్లోంచి కొంత మొత్తం తీసుకుని వెళ్లిపోయాడు. బాగా అప్పుల్లో కూరుకుపోవడం వల్లే ఈ నేరానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. అతడికి నెలకు పన్నులు పోను సుమారు రూ. 27వేల ఆదాయం వస్తుండగా, క్రెడిట్ కార్డుల బిల్లుల రూపంలో దాదాపు 58 లక్షల రూపాయలకు పైగా అప్పులున్నాయి. అందుకే ఈ హత్య, దోపిడీకి పాల్పడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement