
బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బాండ్ బొనాంజా..
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ దీపావళి పండుగ పురస్కరించుకొని ‘బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్’ పై ప్రత్యేక ప్లాన్ ఆఫర్స్ ప్రకటించింది.
ఫ్రీ రెంటల్ ల్యాండ్‌లైన్
ఉచిత నైట్ కాలింగ్; 3 రకాల ప్లాన్‌లు
సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ దీపావళి పండుగ పురస్కరించుకొని ‘బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్’ పై ప్రత్యేక ప్లాన్ ఆఫర్స్ ప్రకటించింది. మూడు, ఆరు, ఏడాది కాల పరిమితి గల రెండు రకాలు గల ప్లాన్‌లో ఎలాంటి డిపాజిట్, ఇన్’స్టలేషన్ చార్జీలు లేకుండా బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ కనెక్షన్‌సౌకర్యాన్ని కల్పించనుంది. అదేవిధంగా బ్రాడ్ బాండ్ కనెక్షన్‌కు అదనంగా ఫ్రీ రెంటల్ ల్యాండ్ లైన్ ఫోన్, 25 నుంచి 50 వరకు ఉచిత కాల్స్‌తో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు ఫ్రీ నైట్ కాలింగ్ సదుపాయాలను ప్రకటించింది.
ప్లాన్ రూ.611..: బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ నెలసరి ప్లాన్ రూ.611 కింద మూడు నెలల కాలపరిమితి ప్యాకేజ్ రిబేట్‌పై రూ.1,770, ఆరు నెలల కాలపరిమితి ప్యాకేజీ ఒకనెల రిబేట్ పై రూ.3,660, ఏడాది కాలపరిమితి ప్యాకేజ్‌కి రెండు నెలల రిబేట్‌పై రూ.6,110లు చార్జీలను నిర్ణ యించింది. ఈ ప్యాకే జీల కింద ప్రతినెల 4 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 40 జీబీ వరకు డౌన్‌లౌడ్, ఆతర్వాత 1 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఆన్‌లిమిటెడ్ డౌన్‌లౌడ్ ఉంటుంది. ఫ్రీ రెంటల్ గల ల్యాండ్‌లైన్‌లో నెలకు 25 కాల్స్‌తోపాటు ఉచిత నైట్ కాలింగ్ వర్తిస్తుంది.
ప్లాన్ రూ.995..: బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ నెలసరి ప్లాన్ రూ.955 కింద మూడు నెలల కాలపరిమితి ప్యాకేజ్ రిబేట్‌పై రూ.2885, ఆరు నెలల కాలపరిమితి ప్యాకేజీ నెల రిబేట్‌పై రూ. 5470, ఏడాది ప్యాకేజ్‌కి 2 నెలల రిబేట్‌పై రూ.9950 లు చార్జీలుగా ప్రకటించింది. ఈ ప్యాకేజీల కింద ప్రతినెల 16 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 80 జీబీ వరకు డౌన్‌లౌడ్, అ తర్వాత 2ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఆన్ లిమిటెడ్ డౌన్‌లౌడ్ సదుపాయం ఉంటుంది.