అనిల్‌ అంబానీకి అంతర్జాతీయ గౌరవం | Anil Ambani gets a seat on Atlantic Council advisory board | Sakshi
Sakshi News home page

అనిల్‌ అంబానీకి అంతర్జాతీయ గౌరవం

Mar 28 2017 2:13 PM | Updated on Sep 15 2018 8:28 PM

అనిల్‌ అంబానీకి  అంతర్జాతీయ గౌరవం - Sakshi

అనిల్‌ అంబానీకి అంతర్జాతీయ గౌరవం

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ అమెరికాలోని అట్లాంటిక్‌ కౌన్సిల్‌ కి ఎంపిక అయ్యారు.

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ  అంతర్జాతీయ గౌరవం దక్కింది.  అమెరికాలోని అట్లాంటిక్‌ కౌన్సిల్‌  బోర్డు సభ్యుడిగా ఎంపిక అయ్యారు.  వాషింగ్‌టన్‌  కేంద్రంగా పనిచేసే ప్రపంచ థింక్ ట్యాంక్  అట్లాంటా కౌన్సిల్‌ తన అంతర్జాతీయ సలహా బోర్డులో సభ్యుడిగా చేరాలని ఆహ్వానించింది. భారతదేశానికి ప్రముఖ వ్యాపారవేత్తను అనిల్‌ అంబానీని అట్లాంటిక్‌ కౌన‍్సిల్‌ లోకి తీసుకున్నట్టు  అట్లాంటా కౌన్సిల్‌ మంగళవారం వెల్లడించింది.  సౌత్‌ ఆసియాలో ముఖ్యంగా వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌ నుంచి అనిల్‌ అంబానీని ఎంపిక చేయడం సంతోషమని సంస్థ చైర్మన్‌ జాన్‌.ఎం. హంట్స్‌ మాన్‌  పేర్కొన్నారు.   


గ్లోబల్‌ కార్పొరేట్లను, రాజకీయ వేత్తలను  అడ్వైజరీ బోర్డులోకి  ఆహ్వానిస్తుంది అట్లాంటా కౌన్సిల్‌.  ఈక్రమంలో న్యూస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రుపర్ట్ ముర్డోచ్, మాజీ స్పానిష్ ప్రధాన మంత్రి జోస్ మరియా అజ‍్నర్‌, ఎయిర్‌ బస్‌  సీఈవో థామస్ ఎండర్స్ ,  మాజీ ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి కెవిన్ రుద్ కూడా కౌన్సిల్‌లో చేరినట్టు అట్లాంటా కౌన్సిల్‌ య ఒక ప్రకటలో  ప్రకటించింది.  
మరోవైపు అట్లాంటిక్‌ కౌన్సిల్‌ కి ఎంపిక కావడంపై అనిల్‌అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికా అగ్రగామి సంస‍్థ ప్రపంచ వ్యూహాత్మక వ్యవహారాల మీద అత్యంత ప్రభావవంతమైన మేధావుల  అట్లాంటిక్ కౌన్సిల్  సలహా బోర్డులో చేరడం ఆనందదాయకమన్నారు. ప్రధాన మంత్రి  మోదీ దార్శనికతకు ఆయన నాయకత్వంలో సాగుతున్నకృషికి ఇది స్పష్టమైన గుర్తింపు అని  వ్యాఖ్యానించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement