దుమారం రేపుతున్న లాలు ఫొటో.. | After Tej Pratap, now Lalu Yadav's picture with Siwan sharp shooter goes viral | Sakshi
Sakshi News home page

దుమారం రేపుతున్న లాలు ఫొటో..

Sep 28 2016 8:56 AM | Updated on Jul 30 2018 8:41 PM

దుమారం రేపుతున్న లాలు ఫొటో.. - Sakshi

దుమారం రేపుతున్న లాలు ఫొటో..

ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్తో కూడా జావేద్ కలిసున్న ఫొటో తాజాగా బయటకు రావడం దుమారం రేపుతోంది.

బిహార్ సీనియర్ జర్నలిస్ట్ రంజన్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న జావేద్ భట్ ఆ రాష్ట్ర మంత్రి తేజ్ ప్రతాప్తో కలవడం, ఫొటో దిగడంపై తీవ్ర విమర్శలు రాగా.. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్తో కూడా జావేద్ కలిసున్న ఫొటో తాజాగా బయటకు రావడం దుమారం రేపుతోంది. ఓ వేదికపై కూర్చున్న లాలుతో జావేద్ మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంత్రి తేజ్ ప్రతాప్.. లాలు కొడుకన్న విషయం తెలిసిందే. హత్య కేసులో నిందితుడితో తండ్రీకొడుకులు సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడంతో వారిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆర్జేడీ నాయకులు నేరగాళ్లను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

కాగా లాలుతో జావేద్ కలిసున్న ఫొటో పాతదని భావిస్తున్నారు. మంత్రి తేజ్ ప్రతాప్తో మాత్రం జావేద్ ఇటీవల కలిశాడు. రంజన్ హత్య కేసులో మరో నిందితుడు కైఫ్తో కలసి జావేద్ మంత్రితో కలిసున్న ఫొటో బయటకు వచ్చింది. దీనిపై మంత్రి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. రంజన్ హత్య కేసును సరిగా దర్యాప్తు చేయడం లేదని, సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ ఆయన భార్య ఆశ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఓ వైపు సీబీఐ నాయకులు ఈ కేసును విచారిస్తుండగా.. లాలు, ఆయన తనయుడుతో నిందితులు కలిసున్న ఫొటోలు బయటకు రావడంతో ఆర్జేడీ నాయకులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement