2013కి వీడ్కోలు చెబుతూ | 2013 business review | Sakshi
Sakshi News home page

2013కి వీడ్కోలు చెబుతూ

Dec 29 2013 12:30 AM | Updated on Oct 1 2018 5:14 PM

2013కి వీడ్కోలు చెబుతూ మరో రెండు రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.

కాలచక్రంలో మరో ఏడాది గతం ఖాతాలోకి వెళ్లిపోతోంది. 2013కి వీడ్కోలు చెబుతూ మరో రెండు రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. వాణిజ్యపరంగా చూస్తే ఈ ఏడాది పొదుపు, పెట్టుబడుల విషయంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వరుసగా పుష్కరకాలంపాటు లాభాలను అందించిన బంగారం తొలిసారిగా నష్టాలను చవి చూపించింది. మరోపక్క ఇన్‌ఫ్లేషన్ బాండ్స్ పేరుతో సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్ సాధనాన్ని ఆర్‌బీఐ పరిచయం చేసింది. పర్సనల్ ఫైనాన్స్ రంగంలో జరిగిన ప్రధాన ఘట్టాలను అవలోకనం చేసుకుంటూ... ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా 2014లో వివిధ రంగాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై అధ్యయనమే ఈ వారం ప్రాఫిట్ లీడ్ స్టోరీ...
 
 అలా జరిగింది..
 
 ఇన్వెస్ట్‌మెంట్ అడై ్వజర్ల నమోదు తప్పనిసరి
 పెట్టుబడుల విషయంలో సలహాలిచ్చే ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ల(ఐఏ) విషయంలో సెబీ నిర్ణయం తీసుకుంది. సెబీ వద్ద నమోదు చేసుకున్న ఐఏలు మాత్రమే సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు ఇలా సలహాలిచ్చే విషయంలో పాటించాల్సిన తప్పనిసరి నిబంధనలను కూడా ప్రవేశపెట్టింది. ఇన్వెస్టర్ అవసరాలు, ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం వంటి విషయాలను తెలుసుకున్న దానికి అనుగుణంగా సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలకు సంబంధించి ఐఏ పూర్తి రికార్డును నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో మిస్ సెల్లింగ్‌ని అరికట్టవచ్చన్నది సెబీ ఆలోచన.


 
 ఫండ్స్‌కి రంగు పడింది!                                                                                                                       
 మ్యూచువల్ ఫండ్స్, వాటి ఇన్వెస్ట్‌మెంట్ విధానం, రిస్క్ ఆధారంగా ఆయా పథకాలను నిర్దిష్ట రంగుల్లో సూచించాలని సెబీ ఆదేశించింది. ఈ కలర్ కోడింగ్ ఆధారంగా సామాన్యులు కూడా ఆ పథకాల్లో ఉండే నష్టభయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. నష్టభయం ఆధారంగా మ్యూచువల్ ఫండ్ పథకాలను మూడు రకాలుగా సెబీ వర్గీకరించింది. తక్కువ రిస్క్ ఉండే పథకాలకు నీలి రంగు, మధ్యస్థాయి రిస్క్ ఉంటే పసుపు, అధిక రిస్క్ ఉంటే గోధుమ రంగును కేటాయించారు. కానీ దీనిపై పూర్తిగా ఆధారపడలేని పరిస్థితి. ఉదాహరణకు స్మాల్ క్యాప్, ఇండెక్స్ ఫండ్స్‌లకు అధిక రిస్క్ ఉండే గోధుమ రంగును కేటాయించారు. కానీ స్మాల్ క్యాప్ ఫండ్స్ కంటే ఇండెక్స్ ఫండ్స్‌లో రిస్క్ తక్కువగా ఉంటుంది.

‘లైఫ్’ మారుతోంది
 
 
 జీవిత బీమా పథకాల రూపకల్పన గురించి ఐఆర్‌డీఏ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. ఇవి జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బీమా పథకాలు సులభంగా అర్థమయ్యే విధంగా, అధిక ప్రయోజనాలు కల్పించేలా వీటిని రూపొందించడం జరిగింది. దీంతో ఇక నుంచి సంప్రదాయ పాలసీలు 45 ఏళ్ల లోపు వారికి చెల్లించే వార్షిక ప్రీమియానికి 10 రెట్లు తక్కువ కాకుండా బీమా రక్షణను కల్పించాల్సి ఉంటుంది. వీటితోపాటు సరెండర్ వాల్యూని కూడా పెంచడం జరిగింది. అలాగే బీమా పథకాలను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపర్చుకునే అవకాశాన్ని ఐఆర్‌డీఏ అందుబాటులోకి తీసుకొచ్చింది.
 
 ఒకే పథకం రెండు ఎన్‌ఏవీలు                                                                                                                
 ఏజెంట్లు, బ్రోకర్ల ప్రమేయం లేకుండా నేరుగా మ్యూచువల్ ఫండ్ సంస్థ ద్వారా కొనుగోలు చేసే పథకాలకు ప్రత్యేక ఎన్‌ఏవీ ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న పాత పథకాల ఎన్‌ఏవీలు అలాగే కొనసాగుతుండగా, అవే పథకాల్లో డెరైక్ట్‌గా ఇన్వెస్ట్ చేసేవాటికి ప్రత్యేకంగా ఎన్‌ఏవీని ఇవ్వడం జరిగింది. డెరైక్ట్‌గా ఇన్వెస్ట్ చేసే వాటిలో చార్జీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ మేరకు రాబడులు కూడా పెరుగుతాయి. ఇందుకోసం డెరైక్ట్ పథకాలకు ప్రత్యేక ఎన్‌ఏవీని ఇవ్వడం జరిగింది. అదే రెగ్యులర్ పథకాల్లో అయితే ఏజెంట్ కమీషన్ ఉంటుంది కాబట్టి ఆ మేరకు ఎన్‌ఏవీ విలువ తగ్గుతుంది. గతంలో సర్వీస్ ట్యాక్స్ మ్యూచువల్ ఫండ్ చెల్లిస్తుండగా ఇప్పుడది నేరుగా ఇన్వెస్టర్ నుంచే వసూలు చేయాలని సెబీ నిర్ణయించింది.
 
 ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్‌డ్ బాండ్స్
 

ఈ ఏడాది ఇన్వెస్టర్లకు కొత్త ఇన్వెస్ట్‌మెంట్ సాధనం అందుబాటులోకి వచ్చింది. ద్రవ్యోల్బణ నుంచి వ్యక్తిగత ఇన్వెస్టర్ల పొదుపును కాపాడేందుకు  ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్‌డ్ బాండ్స్‌ను ఆర్‌బీఐ ప్రవేశపెట్టింది. పదేళ్ల కాలపరిమితి ఉండే ఈ బాండ్స్ సీపీఐ ఇండెక్స్‌కి అనుసంధానమై ఉంటుంది. ఈ బాండ్స్‌పై వడ్డీరేటు సీపీఐ ఇండెక్స్ కంటే 1.5 శాతం అధికంగా ఉంటుంది. ఈ వడ్డీని ఆరు నెలలకు ఒకసారి కలపడం జరుగుతుంది. దీర్ఘకాలంలో డెట్ పోర్ట్‌ఫోలియోను ద్రవ్యోల్బణం నుంచి రక్షించాలనుకునే వారికి ఈ ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్‌డ్ బాండ్స్ బాగుంటాయి.

 

 

 


 
 
 ఇలా ఉండొచ్చు!
 
 2013లో రెగ్యులేటరీ సంస్థలు పలు ప్రధాన నిర్ణయాలు తీసుకోవడంతో వచ్చే ఏడాది ఎక్కువ మార్పులు  ఉండకపోవచ్చు. జరిగితే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్‌కి సంబంధించి కొన్ని మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇన్వెస్ట్‌మెంట్ విషయానికి వస్తే 2014లో ఏ రంగంలో ఇన్వెస్ట్ చేయాలన్నది ప్రతి
 ఒక్కరికీ ఒక పెద్ద ప్రశ్నగా తయారయ్యింది. ఇప్పటివరకు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించిన బంగారం ఈ ఏడాది అడియాసలు చేసింది. ఇదే సమయంలో రెండేళ్లుగా ఈక్విటీలు లాభాలను అందిస్తున్నాయి. ఇప్పుడు 2014లో  వివిధ రంగాలు  ఏ విధంగా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం...
 
 దశలవారీగా షేర్లు కొనాలి

 ఈ ఏడాది ఈక్విటీలు మిశ్రమ రాబడులను అందించాయి. లార్జ్ క్యాప్ షేర్లు అంటే సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్‌లు తొమ్మిది శాతం వరకు లాభాలను ఇస్తే, ఇదే సమయంలో మిడ్‌క్యాప్ షేర్లు ఆరు శాతంపైగా నష్టపోయాయి. సంవత్సరం చివర్లో కొన్ని మిడ్‌క్యాప్ షేర్లు కొంత రికవరీని సాధించాయి. 2014లో కూడా ఈక్విటీ మార్కెట్లు ఇదే విధంగా ఉండే అవకాశాలున్నప్పటికీ ప్రథమార్థం వరకు ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికీ దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఈక్విటీలు ఆకర్షణీయంగా ఉన్నాయి. అందుకనే ప్రతీ పతనాన్ని కొనుగోళ్లకు ఉపయోగించుకోమని సూచిస్తాను. ఒకేసారిగా కాకుండా దశలవారీగా ఇన్వెస్ట్ చేయండి. మంచి మిడ్‌క్యాప్ షేర్లను ఎంపిక చేసుకొని వాటిలో కూడా కొంత మొత్తం కేటాయించండి. మార్కెట్లు బాగా లాభాల్లో ఉన్నప్పుడు డిఫెన్సివ్ సెక్టార్ స్టాక్స్‌నూ, అదే మార్కెట్లు పడినప్పుడల్లా కొన్ని బీటా స్టాక్స్‌నూ పోర్ట్‌ఫోలియోకి జత చేసుకోండి.
 
 పుత్తడిపై పెట్టుబడి సురక్షితం                                                                                                                   
 ఇప్పుడు అందర్నీ ఎక్కువగా అయోమయానికి గురిచేస్తున్నది ఏదైనా ఉందంటే అది బంగారమే. 2013 మాదిరిగానే వచ్చే ఏడాది కూడా బంగారం నష్టాలను అందిస్తుందా లేక ఇక్కడ నుంచి పరుగులు పెడుతుందా అన్నది అనేకమందిని వేధిస్తున్న ప్రశ్న. అంతర్జాతీయంగా బంగారం లభ్యత అనేది తక్కువగా ఉండటంతో ఇప్పటికీ దీన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా చూడచ్చు. కాని బంగారం ధరల కదలికలు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు పెరుగుతాయా లేక పడిపోతాయా అన్నదానిపై ఆధారపడి ఉంటాయి. బంగారాన్ని పూర్తిస్థాయి పెట్టుబడి సాధనంగా కాకుండా ఈక్విటీలకు అనుబంధ సాధనంగానే భావించాలి. పోర్ట్‌ఫోలియోలో 6-8 శాతం బంగారానికి కేటాయిస్తే సరిపోతుంది.
 
 షార్ట్ టర్మ్ ఇన్‌కమ్ బెస్ట్
 ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయాలు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక బాండ్ ఈల్డ్స్ దెబ్బతిన్నాయి. రూపాయి పతనం కూడా ఆర్‌బీఐ కఠిన నిర్ణయాలకు కారణంగా నిలిచింది. అధికాదాయం అంటే 30 శాతం ఆదాయపన్ను పరిధిలో ఉన్న వారికి ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనం. మరో కొన్ని త్రైమాసికాలు వడ్డీరేట్లు ఇదే విధంగా స్థిరంగా ఉంటాయని భావిస్తున్నాం. ద్రవ్యోల్బణం ఇంకా గరిష్ట స్థాయిలోనే కొనసాగుతుండటంతో వడ్డీరేట్లపై ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే షార్ట్‌టర్మ్ ఇన్‌కమ్ ఫండ్స్ బాగుంటాయి. ద్వితీయార్ధంలో కాలపరిమితిని పెంచుకోవచ్చు.
 
 ఎన్నికల దాకా రియల్టీపై ఒత్తిడి                                                                                                             
 అధిక వడ్డీరేట్లు ఈ రంగంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. వడ్డీరేట్లు గరిష్టస్థాయిలో ఉండటంతో కొనుగోలుదారుల నుంచి డిమాండ్ అంతగా లేకపోగా, మరోపక్క నుంచి రుణ వ్యయం పెరిగి రియల్టీ కంపెనీలు రెండిందాల నష్టపోతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు ఈ రంగం ఇదే విధమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారానికి భారీగా నిధులు ఖర్చు చేస్తారు కాబట్టి ఈ రంగంలోకి పెట్టుబడులు అంతగా వచ్చే అవకాశాలుండవు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలు కూడా రానున్న కాలంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటాయి.  కాని మొత్తం మీద చూస్తే దీర్ఘ, మధ్యకాలానికి రియల్ ఎస్టేట్ రంగం పాజిటివ్‌గానే ఉంటుంది. ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడితే మరో రియల్ ఎస్టేట్ ధరల బూమ్‌ను చూడొచ్చు. కొంతకాలం మాత్రం ప్రీమియం సెగ్మెంట్‌కు దూరంగా ఉండండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement