అగ్ని ప్రమాదం: 10 మంది సజీవదహనం | 10 died in fire accident in hotel at pratapgarh | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదం: 10 మంది సజీవదహనం

Jun 19 2015 9:51 AM | Updated on Sep 5 2018 9:45 PM

అగ్ని ప్రమాదం: 10 మంది సజీవదహనం - Sakshi

అగ్ని ప్రమాదం: 10 మంది సజీవదహనం

అలహాబాద్ ప్రతాప్గఢ్లోని ఓ హోటల్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు.

లక్నో : అలహాబాద్ ప్రతాప్గఢ్లోని బాబాగంజ్ ప్రాంతంలోని గోయెల్ హోటల్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ  ప్రమాదంలో 10 మంది సజీవదహనమైయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని జిల్లా ఎస్పీ బలికరణ్ యాదవ్ వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని..  మెరుగైన వైద్య చికిత్స కోసం అలహాబాద్ తరలించాలని వైద్యులు సూచించారని చెప్పారు. ఈ నేపథ్యంలో వారిని అలహాబాద్ తరలించినట్లు పేర్కొన్నారు. గోయెల్ హోటల్లో ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయని... దీంతో హోటల్లో నిద్రిస్తున్న వారు నిద్రిస్తున్నట్లే సజీవ దహనమైయ్యారని వెల్లడించారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement