కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామ శివారులో అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మరణించాడు.
కరీంనగర్ (జూలపల్లి) : కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామ శివారులో అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మరణించాడు. ఊరి చివరన ఉన్న చెట్టుకు ఉరేసుకుని కళ్లపెల్లి నరేష్(23) అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అయితే ఉరేసుకున్న యువకుడి చేతులు కట్టేసి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.