కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం వద్ద సోమవారం గోదావరి నదిలో స్నానానికి దిగిన ఆవుల రమేశ్(25) అనే యువకుడు గల్లంతయ్యాడు.
కరీంనగర్ (మహదేవ్‌పూర్) : కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం వద్ద సోమవారం గోదావరి నదిలో స్నానానికి దిగిన ఆవుల రమేశ్(25) అనే యువకుడు గల్లంతయ్యాడు. వివరాల ప్రకారం..ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం బుధాకలాన్ గ్రామానికి చెందిన ఓ 25 మంది బృందం మూడు వాహనాలలో తొలి ఏకాదశి సందర్భంగా పుణ్యస్నానాలకు కాళేశ్వరం బయలుదేరారు.
వీరిలో ఆవుల రమేష్, మోహన్ , శ్రీకాంత్ అనే ముగ్గురు యువకులు స్నానానికి గోదావరి వద్దకు వెళ్లారు. కాగా రమేష్ స్నానానికి దిగుతుండగా ప్రమాదవశాత్తూ జారి పడి గల్లంతయ్యాడు. రమేష్ కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.