కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
కడెం (ఆదిలాబాద్): కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం మద్దిపడగ గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన బైరి లక్ష్మి(25) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ కలహాలతోనే లక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.