అంబేద్కర్‌ లేకుంటే నేను లేను : కడియం శ్రీహరి

Without Ambedkar Im Nothing Says Kadiyam Srihari - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమం అంబేద్కర్‌ రాసిన ఆర్టికల్‌ 3 ఫలితంగానే ఫలించిందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఆంద్రా బ్యాంక్‌ మూడో అఖిల భారత సర్వసభ్య సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్‌ ఆశయాల మేరకే సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్‌ లేకుంటే నేను ఇక్కడ ఉండేవాడిని కానని అన్నారు. అందరికి విద్యనందించాలన్న అంబేద్కర్‌ ఆశయంలో భాగమే గురుకులాలు అని పేర్కొన్నారు. దళితులు ఉన్నతంగా ఎదిగిన తరువాత కూడా వారిపై దాడులు జరుగుతున్నామని ఆం‍దోళన వ్యక్తం చేశారు.

ముందస్తు బెయిల్‌ అవసరం లేదన్న సుప్రీంకోర్టు తీర్పుపై దళితులు రోడ్డెక్కారని, పీఓఏ (అట్రాసిటి చట్టం) చట్టాన్ని కాపాడడం కోసం అనేక మంది చనిపోయారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పీఓఏ చట్టంపై ఆర్డినెన్స్‌ తీసుకురావాలని కడియం డిమాండ్‌ చేశారు. ‘ఆ చట్టాని బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మద్దతునిస్తుంది. ఎస్సీ, ఎస్టీ కమిషన్లు పీఓఏ చట్టాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. పేదలకు లబ్ది చేకూరాలని బ్యాంకులను జాతియం చేశారు. కానీ ఆ లక్ష్యం నెరవేరలేదు. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీలు లక్షల కోట్లు దోచుకున్నారు. పేదవానికి పదివేలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు’ అని వ్యాఖ్యానించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top