వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతం చేసేందుకు ప్రయత్నించిన భార్య, ఆమె ప్రియుడిని మంగళవారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
బోడుప్పల్ (హైదరాబాద్) : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతం చేసేందుకు ప్రయత్నించిన భార్య, ఆమె ప్రియుడిని మంగళవారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం... నాచారం రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉండే కొడాలి లింగన్న(50), జయమ్మ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కాగా అదే ప్రాంతంలో మార్బుల్ టైల్స్ పని చేసే ఈదులకంటి సుధాకర్‌రెడ్డికి, జయమ్మకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం లింగన్నకు తెలియడంతో వారిద్దరి మధ్య తరుచుగా గొడవలు జరిగేవి. దీంతో గత నాలుగు నెలల నుంచి జయమ్మ, సుధాకర్‌రెడ్డి బోడుప్పల్‌లో సహజీవనం సాగిస్తున్నారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్న లింగన్నను అడ్డు తొలగించుకోవాలని జయమ్మ, సుధాకర్‌రెడ్డి పథకం వేశారు.
దీనిలో భాగంగా ఇంటి పట్టాల పేరు చెప్పి ఈనెల 11వ తేదీన జయమ్మ తన భర్త లింగన్నను బోడుప్పల్‌కు తీసుకొచ్చింది. రాత్రి ఇద్దరూ భోజనం చేసి భవనంపై పడుకునేందుకు వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో జయమ్మ తన భర్త లింగన్న మెడకు తాడు బిగించి, దుప్పటితో నోటిపై అడ్డుపెట్టింది. అప్పడే భవనంపైకి వచ్చిన సుధాకర్‌రెడ్డి లింగన్న వృషణాలు తొలగించాడు. నొప్పి భరించలేక అతడు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు రాగా జయమ్మ, సుధాకర్‌రెడ్డిలు పారిపోయారు. పోలీసులు అక్కడకు చేరుకుని లింగన్నను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం జయమ్మ, సుధాకర్‌రెడ్డిని అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. లింగన్న ప్రస్తుతం కోలుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.