వివాహేతర సంబంధాన్ని తెంచుకోమని ఎన్నిసార్లు చెప్పినా భార్య వినిపించుకోకపోవడంతో.. ఆగ్రహానికి గురైన భర్త ఆమెను కిరాతకంగా హతమార్చాడు.
తాడేపల్లి (గుంటూరు) : వివాహేతర సంబంధాన్ని తెంచుకోమని ఎన్నిసార్లు చెప్పినా భార్య వినిపించుకోకపోవడంతో.. ఆగ్రహానికి గురైన భర్త ఆమెను కిరాతకంగా హతమార్చాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చైరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సత్యవతి(30) అనే మహిళ.. అదే గ్రామానికి చెందిన రంజిత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది.
ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గతంలో పలుమార్లు వాగ్వాదం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా భార్య తీరు మార్చుకోకపోవడంతో అసహనానికి గురైన భర్త రామారావు.. ఆదివారం ఉదయం ఆమె నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడి చేసి హతమార్చి పరారయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా మృతురాలి తమ్ముడు.. తన సోదరిది హత్య కాదని, అనారోగ్యంతోనే ఆమె మృతి చెందిందని పోలీసులకు చెప్పడం గమనార్హం.