'ఇప్పటికే 118 స్కూళ్లను సీజ్ చేశాం' | we have seazed 118 schools, says collector mukesh kumar meena | Sakshi
Sakshi News home page

'ఇప్పటికే 118 స్కూళ్లను సీజ్ చేశాం'

Jun 26 2014 2:28 PM | Updated on Sep 4 2018 5:07 PM

విద్యా ప్రమాణాలు పాటించకుండా నిబంధనలకు పాతరేస్తున్న స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.

హైదరాబాద్:విద్యా ప్రమాణాలు పాటించకుండా నిబంధనలను పాతరేస్తున్న స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఈ రోజు ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై ఆయన సమీక్ష నిర్వహించారు. నిబంధనలు పాటించని స్కూళ్లపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. నిబంధనలు పాటించని 118 స్కూళ్లను ఇప్పటికే సీజ్ చేసినట్టు తెలిపారు. ఫీజుల అంశానికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వని 770 స్కూళ్లకు ఇవాళ నోటీసులు పంపుతున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ స్కూళ్లు వారంలోగా సమాధానం ఇవ్వకుంటే గుర్తింపు రద్దు చేస్తామన్నారు.

 

ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ వరకూ రూ.9 వేలు ఫీజు మాత్రమే ఉండాలని, హైస్కూళ్లకు మాత్రం రూ. 12 వేలు వసూలు చేయాలని కలెక్టర్ తెలిపారు. అంతకు మించి వసూళ్లు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement