‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి | We Expect Full Pass Percentage In Class Ten | Sakshi
Sakshi News home page

‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

Nov 15 2018 7:11 PM | Updated on Nov 15 2018 7:11 PM

We Expect Full Pass Percentage In Class Ten - Sakshi

విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో   

వాంకిడి(ఆసిఫాబాద్‌): పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయాలని డీఈవో భిక్షపతి అన్నారు. మండలంలోని ఇందాని జెడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వసతులు, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల పనితీరు పై అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు. బోధన అంశాలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులపై శ్రద్ధ వహించాలన్నారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం ఇవ్వాలన్నారు. అనంతరం మొదటి సారిగా పాఠశాలకు వచ్చిన డీఈవోను పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రాథోడ్‌ సుభాష్, ఉపాధ్యాయులు మహేశ్, సూర్యభాను తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement