అటవీ కార్యాలయం ఎదుట ధర్నా | villagers protest of forest office | Sakshi
Sakshi News home page

అటవీ కార్యాలయం ఎదుట ధర్నా

Feb 21 2015 6:33 PM | Updated on Oct 4 2018 6:03 PM

ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో ప్రధాన రహదారిపై అటవీశాఖ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో ప్రధాన రహదారిపై అటవీశాఖ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఖానాపూర్ మండలంలోని ఏక్‌బాల్‌పుర్ గ్రామానికి చెందిన గుగ్లావత్ గెమా అనే యువకుడిని అటవీ సిబ్బంది అనవసరంగా కొట్టారనే కారణంతో గ్రామస్తులు రాస్తారోకోకు దిగారు. ఆ తర్వాత అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

దాంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అడవిలోని కలపను అక్రమంగా రవాణా చేస్తున్నాడనే కారణంతో కొంతమంది అటవీ సిబ్బంది గుగ్లావత్‌పై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అటవీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement