విజయ్‌ దేవరకొండ.. రౌడీ బ్రాండ్‌

Vijay Devarakonda Launch Rowdy Brand Jeans - Sakshi

జూబ్లీహిల్స్‌: యువ హీరో విజయ్‌ దేవరకొండ సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ‘రౌడీ’ పేరుతో సొంతంగా రూపొందించిన క్లొతింగ్‌ బ్రాండ్‌ను ఆదివారం జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్‌ పబ్‌లో ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు. అందరికీ అందుబాటులో ధరల్లో దుస్తులను అందించే లక్ష్యంతో సరికొత్త విభాగంలోకి అడుగుపెట్టినట్లు చెప్పారు.

తనను చిన్నప్పుడు స్కూల్లో, ఇంట్లో అందరూ రౌడీ అని ప్రేమగా పిలిచేవారని, ఈ రోజు తనకు నచ్చిన పని, వృత్తి చేయగలుగుతున్నానంటే కేవలం మొండితనంతో కూడిన రౌడీయిజమే కారణమన్నారు. రౌడీగానే జీవించాలనుంటున్నాను అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అనంతరం ఇటీవల తాను పెళ్లిచూపులు చిత్రానికిగాను సాధించిన ఫిలిమ్‌ఫేర్‌ అవార్డును వేలం వేయగా దివీస్‌ ల్యాబ్స్‌కు చెందిన శకుంతల దివీ రూ.25 లక్షలతో దక్కించుకున్నారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం www.rowdyclub.in పేరుతో రూపొందించిన వెబ్‌సైట్, యాప్‌లను ఆవిష్కరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top