కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తక్కడపల్లిలో
మునిపల్లి : కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తక్కడపల్లిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొల్ల యాదమ్మ(38) రెండు సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపుడుతోంది. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తీవ్రంగా కడుపునొప్పి రావడంతో బాధ భరించలేక ఇంట్లో పురుగుల మందు తాగింది.
కుటుంబ సభ్యులు గమనించి సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు మృతురాలి తమ్ముడు వెంకటేశం శనివారం బుదేరా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.