ఈనెల 19న ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల 

TS Edcet Results On 19th June - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్‌–2019 ఫలితాలను ఈనెల 19వ తేదీన ఉదయం 11:30 గంటలకు విడుదల చేయనున్నట్లు ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ మృణాళిని ఒక ప్రకటనలో తెలిపారు. మాసాబ్‌ట్యాంకులోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఈ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేస్తారని పేర్కొన్నారు. మే 31వ తేదీన జరిగిన ఈ పరీక్షకు 43,113 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top