పోలవరంతో మనకు నష్టమే | TS Deputy CM Kadiyam Srihari met Odisha CM Naveen Patnaik | Sakshi
Sakshi News home page

పోలవరంతో మనకు నష్టమే

Dec 2 2017 3:37 AM | Updated on Aug 21 2018 8:34 PM

సాక్షి, హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒడిశాతోపాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయ ని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ వ్యాఖ్యానించారు. భువనేశ్వర్‌లో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ శుక్రవారం నవీన్‌ పట్నాయక్‌ను అక్కడ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈసందర్భంగా నవీన్‌ పట్నాయక్‌  పోలవరం వల్ల ఒడిశాలో ముంపునకు గురవుతున్న గిరిజన గూడేలు, అటవీ భూముల గురించి కడియం, రామ్మోహన్‌తో చర్చించారు. పోలవరంపై తమ వైఖరిని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని కడియంను కోరారు.  తెలంగాణలో కూడా గిరిజన గూడేలు ముంపునకు గురవుతున్నాయని నవీన్‌ పట్నాయక్‌ కు కడియం, రామ్మోహన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement