చిందు కళాకారులకు అండగా టీఆర్‌ఎస్‌ | TRS Govt Will Suppoorts The Artists | Sakshi
Sakshi News home page

చిందు కళాకారులకు అండగా టీఆర్‌ఎస్‌

Nov 8 2018 10:45 AM | Updated on Nov 8 2018 10:45 AM

 TRS Govt Will Suppoorts The Artists - Sakshi

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌

 సాక్షి,హుస్నాబాద్‌: కళామతల్లిని నమ్ముకొని కళాకారుల వృత్తితో జీవిస్తున్న చిందు కళాకారులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని విధాల  ఆదుకుంటుందని మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని వీఎల్‌ రెడ్డి గార్డెన్‌లో చిందు కళాకారుల ఆశీర్వాద సభను నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ   సినిమాలు, సీరియల్స్‌ వల్ల చిందు కళాకారులకు ఆదరణ తక్కువైందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ వచ్చిన తర్వాతనే చిందు, యక్షగానంతో పాటు అన్ని కళాకారులకు అండగా నిలిచి వారి బాగోగులను చూస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపిందని అన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సుద్దాల చంద్రయ్య, మార్కెట్‌ కమిటి చైర్మన్‌ ఎడబోయిన తిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అద్యక్షుడు వెంకట్రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ ఇంచార్జీ కాసర్ల అశోక్‌బాబు, పట్టణ అద్యక్షుడు అన్వర్‌ పాష, చిందు కళాకారుల సంఘం జిల్లా అద్యక్షుడు గడ్డం నాగరాజు, కౌన్సిలర్లు గాదెపాక రవీందర్, ఇంద్రాల సారయ్య, నాయకులు మేకల వీరన్న యాదవ్, చిట్టి గోపాల్‌రెడ్డి, క్రాంతిరెడ్డి, గడ్డం మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement